Minister Harish Rao తెలంగాణ రాష్త్రం గజ్వేల్ పట్టణంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సందర్శించారు శిబిరానికి వచ్చిన మహిళలతో మాట్లాడి అక్కడ వైద్య సేవలు ఎలా అందుతున్నాయో ఆరా తీశారు..
గజ్వేల్ పట్టణంలో జరుగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అక్కడ వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయని చెప్పటంతో సంతోషం వ్యక్తం చేశారు.. వంద రోజుల్లో అందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పుకొచ్చారు..
శిబిరాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని అన్నారు 70 లక్షల మందికి కంటి వెలుగు పరీక్షలు ఇప్పటివరకు చేసామని 32 లక్షల మంది పురుషులు కాగా 38 లక్షల మంది మహిళలని చెప్పారు మహిళలే ఎక్కువగా ఈ సేవలు పొందుతున్నారని వారికి రాష్ట్రంలో ఆదరణ లభిస్తుందని మరొకసారి గుర్తు చేశారు.. రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 20 లక్షల మందికి కంటి సమస్యలు తొలగిపోయాయని వంద రోజుల్లో అందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పుకొచ్చారు.. ఇలాగే రాష్ట్రంలో ముందు ముందు మరీనా కార్యక్రమాలు చేపడతామని ప్రజలు సంక్షేమమే తమ ధ్యేయమంటూ తెలిపిన హరీష్ రావు ప్రజలందరూ ప్రభుత్వం అందించే సేవలను సక్రమంగా అందుకోవాలని వాటిని వినియోగించుకోవాలని చెప్పుకొచ్చారు. అలాగే బాగా కృషి చేస్తున్న వైద్యారోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సిబ్బందికి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు.