Ysrcp Formation Day: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 13 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ పార్టీకి అభినందనలు వెల్లువెత్తాయి. మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా 2010 మార్చి 12వ తారీఖున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. వైయస్సార్ అనగా యువజన శ్రామిక రైతు పార్టీగా దీన్ని స్థాపించడం జరిగింది.
వైసీపీకే విజయ కేతనం(Ysrcp Formation Day)
పార్టీ స్థాపించిన వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో 19 స్థానాలకు గాను 18 స్థానాలు గెలిచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జై కేతనం ఎగురవేసింది. ఆ రోజే ప్రజలంతా జగన్ వెంట ఉన్నారని జగన్ మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశయాలను నెరవేర్చగలరని భావించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి 67 స్థానాల్లో గెలిచి బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. ప్రతిపక్షంగా ప్రజల సమస్యలను అత్యంత బాధ్యతాయుతంగా అధికార పక్షానికి తెలిపింది.
కాగా 2019 జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 స్థానాలకు గాను 151 యొక్క స్థానాల్లో జేకేతనం ఎగరవేసి తిరుగులేని మెజార్టీ స్థాపించి అధికారానికి వచ్చింది. పార్టీ స్థాపించిన(Ysrcp Formation Day) 8 ఏళ్లలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో అఖండ విజయం సాధించడం గొప్పతనం అనే చెప్పాలి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అత్యంత బాధ్యత నిర్వహించి మరొక మారు 2024లో అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దానికోసం ఇప్పటి నుంచే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అస్త్ర శాస్త్రాలు ఎక్కుపెడుతుంది. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడుతారో వేచిచూడాలి. గతంలో మదిరే 2024 ఎన్నికల్లో వైసీపీనే అధికారంలోకి వస్తుందనే ఊహాగానాలు వున్నాయి.