ఏపీ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్లతో 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
ఈ సమావేశాల్లోనే మూడు రాజధానులు బిల్లుపై వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కోర్టు కేసుల నేపథ్యంలో విశాఖ రాజధాని అంశంపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.