Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి అనుకూలమైనా మరియు అద్భుతమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో కల్పించడంతో ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు భారీగా పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంకి పెట్టుబడులు వెలువల్లా వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక పెద్ద సంస్థను రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆకర్షించినట్టు సమచారం.
ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ జాబితాలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నైవేలి లిక్విడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా చేరింది.. ఈ విషయాన్ని నైవేలి లిమిటెడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ప్రసన్నకుమార్ స్వయంగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో నైవేలి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని ప్రస్తుతం 3000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో పునరుత్పత్తి శక్తి విభాగంలో తాము పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనిపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సైరా మరియు పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు
తాము పెట్టుబడులు పెట్టడానికి భారతదేశంలో అనుకూలమైనటువంటి రాష్ట్రాల కోసం అన్వేషించామని అందులో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. అన్ని అనుకూలిస్తే దాదాపు 3 వేల కోట్ల రూపాయలతో ఏపీలో 500 నుంచి 1000 మెగావాట్లు దాకా సౌర విద్యుత్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా తమకు సహకారం అందిస్తుందని అందువలన తాము ఎంతో ఆసక్తి కనిపిస్తున్నామని ఆయన పేర్కొన్నాడు. ఇదే గనక జరిగితే ఏపీలో మరింత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రజలందరూ భావిస్తున్నారు