ఏపీలో ఈనెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే ఇంటర్ పరీక్షలు జరగనున్న సంగతి తెల్సిందే. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను జ్ఞానభూమి పోర్టల్ లో ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల లాగిన్లలో అప్ లోడ్ చేసినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
వెంటనే విద్యార్థులకు వాటికి అందించాలని కాలేజీలకు సూచించింది. సందేహాలుంటే 18004257635 టోల్ నంబర్కు ఫోన్ చేయాలని పేర్కొంది. పరీక్షలకు 10.03 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని, 1,489 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపింది.