Ys Vivekananda Reddy వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఈరోజు హైకోర్టులో ఊరట లభించింది. మార్చ్ 10వ తారీఖున సిబిఐ ముందు విచారణకు హాజరు కావాలని సిబిఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనివలన వైయస్ అవినాష్ రెడ్డి తను శుక్రవారం సిబిఐ విచారణకు హాజరు కావాలని అనడంపై తెలంగాణ హైకోర్టులో స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఈ విషయమై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తాజాగా అవినాష్ రెడ్డి పై సోమవారం వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తీర్పునిచ్చింది. మార్చ్ 10వ తారీఖున కాకుండా 14వ తారీఖున సిబిఐ ముందు విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. తన వెంట న్యాయవాదిని కూడా విచారణకు అనుమతించాలని వైయస్ అవినాష్ రెడ్డి పెట్టుకున్నటువంటి దరఖాస్తుకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. విచారణ జరిపేటప్పుడు తనకు ఆడియో మరియు వీడియో రికార్డింగ్ జరిపించాలని విచారణ నిష్పత్తి నిష్పక్షపాతంగా జరిపించాలని ఆయన కోరారు.
ఈ కేసు కు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి తరఫున పి నిరంజన్ రెడ్డి సిబిఐ తరఫున అనిల్ కొంపెల్లి వాదన వినిపించారు. ఈ కేసుకు సంబంధించినంత వరకు ఆడియో వీడియో మొత్తం ఫైళ్లను తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు సిబిఐకి స్పష్టం చేసింది. అందువలన విచారణ జరిపేటప్పుడు ఆడియో, వీడియో రికార్డ్ చేయడం వలన కేసు నిష్పక్షపాతంగా జరుగుతుందని అందరూ భావిస్తున్నారు.