ప్రపంచ వ్యాప్తంగా ఉప్పు వినియోగం పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2030 నాటికి ఉప్పు మోతాదును తగ్గించాలనే లక్ష్యానికి దూరంగా చాలా దేశాలు ఉన్నాయని తెలిపింది.
అధిక మొత్తంలో ఉప్పును తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు మూత్రపిండాల వ్యాధులు, ఒబెసిటీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, అకస్మాత్తు మరణాలు సంభవిస్తాయని హెచ్చరించింది.