తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలో బిల్లుపాడు గ్రామంలో శనివారం సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పంట పొలాలను పరిశీలించారు. సిరిపురం మేజర్ కింద ఉన్నటువంటి ఎన్ఎస్పి కెనాల్ నుండి నీరు రాక పంట పొలాలు బీటలు వారుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి బిల్లుపాడు,పరిసర ప్రాంత రైతులు తీసుకెళ్లగా శనివారం ఆయన హుటాహుటిన ఆ గ్రామాలకు చేరుకొని స్వయంగా పంట పొలాల్లోకిదిగి పంటలను పరిశీలించారు..
అనంతరం ఆయన మాట్లాడుతూ పంట చేతికి వచ్చే సమయంలో నీరు లేకపోతే వచ్చే ప్రమాదం ఎంతో ఉంటుందని వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఉన్నతాధికారులతో మాట్లాడి పొలాలకు సక్రమంగా నీరు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు…
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకట్ లాల్,ఎంపీటీసీ రుద్రాక్ష బ్రహ్మం,ఆత్మ డైరెక్టర్ కేతినేని చలపతి,మువ్వా మురళి తూము కృష్ణార్జునరావురైతులు తదితరులు పాల్గొన్నారు…