తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆయన ఫ్యామిలీ ని కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ సర్కార్ టార్గెట్ చేసినట్లు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.
ఈరోజు శనివారం ఆయన తన ట్విట్టర్లో స్పందిస్తూ.. దేశంలోని ముస్లింలను ఆర్థికంగా వెలివేయాలని బీజేపీ ఎంపీలు పిలుపునిచ్చినట్లు అసద్ పేర్కొన్నారు.
మరో వైపు బీజేపీ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు ఆయన విమర్శించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని , సీఎం కేసీఆర్ కుటుంబాన్ని కక్ష్య సాధింపు ఉద్దేశంతోనే మోదీ సర్కార్ టార్గెట్ చేసినట్లు ఎంపీ అసద్ తన ట్వీట్లో ఆరోపించారు.
BJP MPs have called for economic boycott of Muslims; they’ve asked people to keep weapons at home. But Modi govt is busy targeting @TelanganaCMO &
his family for his leadership in Telangana’s inclusive development— Asaduddin Owaisi (@asadowaisi) March 11, 2023