దేశంలోనే సంచలనం సృష్టించిన దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోనే కాదు యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణకు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఆమెను ప్రశ్నించబోయే ఈడీ కార్యాలయం వద్ద ఆంక్షలు అమలు చేస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకోకుండా కట్టడి చేసేలా ఇప్పటికే అదనపు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. మీడియాను సైతం ప్రధాన ద్వారం వరకే అనుమతించనున్నారు.