కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు దేవమ్మ బస్తీ, బీరప్ప నగర్ లలో పాదయాత్ర చేస్తూ.. పూర్తి చేసిన రోడ్లు.. తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం మిగిలి ఉన్న పనులు తెలుసుకున్నారు.
ఆయా పనులన్నీ త్వరలోనే పూర్తి చేయిస్తానని ప్రజలకు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి ఏ విధంగా అందుతున్నాయని తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ రుద్ర అశోక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, కృష్ణ గౌడ్, మారయ్య, వేణు యాదవ్, హజ్రత్ అలీ, పాపుల్ గౌడ్, బాబు గౌడ్, వెంకటేష్, బండ మహేందర్, తెరాల శ్రీనివాస్, అంజయ్య, వీరాచారి, ప్రవీణ్, బస్వేశ్వర్, శశిధర్, సయ్యద్ సాజిద్, మనోజ్, మహేందర్ గౌడ్, పద్మ, పాపి రెడ్డి, సంజీవ రెడ్డి, బుచ్చి రెడ్డి, అజాం, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.