Ysrcp Party వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రజల సంక్షేమం కోసం వైయస్సార్ రైతు భరోసా, అమ్మ ఒడి, విద్య కానుక, చేయూత వంటి పథకాలన్నిటిని ప్రవేశపెట్టగా ప్రజలందరూ వీటి ద్వారా లబ్ధి పొందడం అందరికీ తెలిసిందే. ఇవే కాకుండా డ్వాక్రా మహిళలకు రుణాల మంజూరుకు సంబంధించిన వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉదారత చూపించి వారికి ఎక్కువ మొత్తంలో రుణాలు అందించే అవకాశాన్ని కల్పించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం మరొక పథకాన్ని ప్రవేశపెట్టినట్టు సమచారం.
రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ చిరుధాన్యాల పంపిణీ వచ్చే నెల నుంచి ప్రారంభిస్తున్నట్టు సమాచారం. ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలో మొదటగా ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. లబ్ధిదారులకు ప్రతినెల అందించే బియ్యంలో రెండు కేజీలు ఈ చిరుధాన్యాలను పంపిణీ చేయునట్టుగా తెలుస్తోంది. ఈ రెండు కేజీల బియ్యం కి బదులు రాగులు, జొన్నలు అందిస్తున్నట్టు సమాచారం.
పౌర సరఫరాల మంత్రి కరుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ. ప్రభుత్వం పేదలకు కేవలం బియ్యం మాత్రమే కాకుండా బలవర్ధక ఆహారం అందించాలని ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు తెలియజేశారు. దేనికి సంబంధించి మద్దతు ధర పెంచాలని తాము ఇప్పటికే కేంద్రానికి వినతిపత్రం అందజేసినట్టు రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ అరుణ్ కుమార్ తెలియజేశారు. ఏదేమైనాప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు బలవద్దకమైన ఆహారం అందించడం పై అంతట హర్షం వ్యక్తం చేస్తున్నారు.