తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన గృహలక్ష్మి పథకానికి లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరగనున్నట్లు తెలుస్తుంది.
ఇందులో భాగంగా 50 గజాల స్థలం ఉన్నా.. ఈ పథకం వర్తిస్తుంది. అందులో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టాల్సి ఉంటుందని చెప్పారు. బేస్మెంట్ లెవల్ లో రూ. లక్ష, స్లాబ్ స్థాయిలో రూ.లక్ష, నిర్మాణం పూర్తయ్యాక రూ. లక్ష అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.