Ap Employees Salaries ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మూడు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉద్యోగుల సంఘం సలహాదారుడు అయిన చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి ఏ ఒక్కరికి అన్యాయం జరగలేదని అదేవిధంగా ఉద్యోగులు కూడా ఏమాత్రం అన్యాయం చేయమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అన్నివేళ అన్ని విధాల మీరు చేయడానికి వైఎస్ఆర్సిపి పార్టీ ఉందని పేర్కొన్నారు..
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించి ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం బురద చల్లి ప్రయత్నాలు మానుకోవాలని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి వచ్చిన ఆదాయంలో 90% ఉద్యోగాలు ఇవ్వడానికి సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. జగనన్న ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీట్లకి నిధులు సమకూరుస్తూనే ఉద్యోగాలకు జీతాలు సకాలంలో చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయాల ద్వారా కొత్తగా రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాలని అందువల్ల ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల జీతాలకు సంబంధించిన అంతవరకు అన్ని విషయాల్లో అవగాహన కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు విషయమై ప్రభుత్వం ఆలోచిస్తుందని ఈ విషయంలో తొందరపాటు చర్యలేవి తాము తీసుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా ప్రజలకు అన్నివేళ అన్ని విధాల మీరు చేయడానికి వైఎస్ఆర్సిపి పార్టీ ఉందని ప్రభుత్వం ఆదిశగానే అడుగులు వేస్తుందని అన్నారు.