తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మూడు నెలల పాటు ట్రాఫిక్ రూల్స్ ఉండనున్నయి.. ఇందులో భాగంగా నగరంలోని ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
ఈ ట్రాఫిక్ ఆంక్షలు మార్చి 10 నుంచి జూన్ 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు.. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..
- చిక్కడపల్లి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా అశోక్ నగర్ మీదుగా వెళ్లే వాహనదారులు.. సుధా నందిని హోటల్ లేన్ వద్ద లెఫ్ట్ తీసుకొని సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్ట్రీట్ నంబర్ 9 మీదుగా అశోక్ నగర్ ఎక్స్ రోడ్డు, ఇందిరా పార్కు చేరుకోవాలి.
- వీఎస్టీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా అశోక్ నగర్ వెళ్లాలనుకునే వాహనదారులు.. క్రాస్ రోడ్డులోని హేబ్రోన్ చర్చి లేన్, ఆంధ్రా కేఫ్, జగదాంబ హాస్పిటల్ మీదుగా అశోక్ నగర్ ఎక్స్ రోడ్డు, ఇందిరా పార్కుకు చేరుకోవాలి.
- ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు వచ్చే వాహనదారులు.. అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ నుంచి జగదాంబ హాస్పిటల్, ఆంధ్రా కేఫ్, హేబ్రోన్ చర్చి, చిక్కడపల్లి మెయిన్ రోడ్డుకు చేరుకోవాలి. అశోక్ నగర్ ఎక్స్ రోడ్డు నుంచి స్ట్రీట్ నంబర్ 9 మీదుగా సిటీ సెంట్రల్ లైబ్రరీ, సుధా నంది హోటల్ లేన్, చిక్కడపల్లి మెయిన్ రోడ్డు చేరుకోవాలి.