తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి పూర్వవైభవం తెచ్చిందని కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. శుక్రవారం కోదాడ మండల పరిధిలోని ఎర్రవరంలో శ్రీ దూళ్ల గుట్ట వైకుంఠ బాల ఉగ్ర లక్ష్మీ నారసింహ స్వామి వారి నూతన దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు తన సతీమణి ఇందిరాతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు మాట్లాడుతూ….మహిమాన్విత క్షేత్రంగా వర్థిల్లుతున్న బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం అభివృద్ది కి మరింత చేస్తానని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వ మతాల విశ్వాసాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. దేవాలయాల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆధ్యాత్మికంగా ధర్మ రక్షణకు కృషి చేస్తున్నారన్నారు. పురోహితనాన్ని నమ్ముకొని జీవిస్తూ ఎటువంటి ఆదరణ లేని పేద బ్రాహ్మణులకు ధూప దీప నైవేద్యాలు నిర్వహించినందుకు గౌరవ వేతనాలు ఇస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో సంక్షేమం, శాంతి పెరుగుతుందన్నారు. స్వామి వారి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఇంతటి మహత్యం కలిగిన ఈ బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఆయన సూచించారు.
కోరిన వారి కోరికలను వెంటనే తీర్చే ఆ నరసింహస్వామి కృపకు అందరూ పాత్రులు కాగలరని ఆయన కోరారు. దాతల సహకారంతో ఈ దేవాలయాన్ని పెద్ద ఎత్తున నడిపిస్తున్నామని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దంపతులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నల్లజాల జగన్నాథం, జెడ్పిటిసి మండలపు కృష్ణకుమారి శేషు, ఎర్రవరం సొసైటీ చైర్మన్ నల్లజాల శ్రీనివాసరావు, సర్పంచ్ వీరేపల్లి సుబ్బారావు, మండల కోఆప్షన్ సభ్యులు ఉద్దండు, టిఆర్ఎస్ నాయకులు గంట సత్యనారాయణ, కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, ఎడ్ల వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాయకులు వేమూరి వరదారావు, నాగేంద్రర్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బంటు సత్యనారాయణ, భానుచందర్,పెండెం శీను, మండది శీను, ఆర్ఎస్ నాయకులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు,
దాతలు తదితరులు పాల్గొన్నారు.