ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా పొలిటికల్ గా పెను ప్రంకపనలు సృష్టించింది. తాజాగా ఈడీ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాను 11వ తేదీన విచారణకు హాజరవుతున్నట్లు ఈడిని కోరుతూ బుధవారం లేఖ రాశారు.అయితే ఎమ్మెల్సీ కవిత లేఖ పై ఈడీ నిన్న గురువారం ఉదయం స్పందించింది. ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి మేరకు ఈడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 11వ తేదీ శనివారం రోజున విచారణకు హాజరు కావాలని ఆదేశించింది..