మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని కోదాడ అభివృద్ధి ప్రధాత,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. గురువారం మోత ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి చెందిన 15 మందికి రూ.15 లక్షల కల్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….కళ్యాణ లక్ష్మీ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం అని ఆయన అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంక్షేమ పథకాల పితామహుడని ఆయన కొనియాడారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని అన్నారు. పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని…దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామగా, అన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిళ్ల భారాన్ని తగ్గిస్తున్నారని ఆయన అన్నారు. ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని అన్నారు. ప్రతీ పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా 1,00,116 /- ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ సర్కార్ అని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయలేదని…కేవలం టీఆర్ఎస్ సర్కార్ మాత్రమే అమలు చేస్తున్నదని ఆయన అన్నారు.
ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవం, కేసీఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెండ్లి చేసేవరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా కేసీఆర్ నిలిచారని అన్నారు.ఈ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్ కే దక్కుతున్నదని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని మల్లయ్య యాదవ్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చారి, డిప్యూటీ తాసిల్దార్ సూరయ్య,మాజీ ఎంపీపీ ఆరే లింగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు, టిఆర్ఎస్ నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీల పోరం అధ్యక్షులు కాంపాటి వెంకన్న, ఆయా గ్రామాల సర్పంచులు గుండాల గంగులు, శ్రీనివాస్ రెడ్డి, కోటేష్, సండ్ర పద్మ మధు, ఎంపీటీసీలు మద్ది మధుసూదన్ రెడ్డి, సండ్ర పద్మ మధుసూదన్, బాబు, సొసైటీ వైస్ చైర్మన్ మల్సూర్, మాజీ జెడ్పిటిసి నవీన్ పుష్ప రామకోటి, మండల యూత్ అధ్యక్షులు జానీ పాషా, మిక్కిలి నేని సతీష్, కారింగుల శ్రీనివాస్ గౌడ్, జిల్లెపల్లి ముత్తయ్య, నరేష్,వెంకటేశ్వర్లు, శివరంజన్ రెడ్డి,చింతలపాటి రవి గౌడ్, దేవల, బాబు, భానోత్ ఎంకన్న, టిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.