తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న కొందరు మహిళలకు మహిళా దినోత్సవ సందర్భంగా సన్మానం చేశారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి కార్యాలయంలో నిన్న బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సినీ నటుడు సుమన్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
సినీ హీరోయిన్ నాగ దుర్గ నాయుడు, ఆంధ్రజ్యోతి చీఫ్ సబ్ ఎడిటర్ డిపి అనురాధ, డిజైనర్ గొడి వందన, ఉప్పల్ ఫౌండేషన్ కో చైర్మన్ స్వప్న, డాక్టర్ నాగనందిని, డిజైనర్ లతా రెడ్డి తదితరులను హోం మంత్రి అవార్డులను అందజేసి సత్కరించారు.
మహిళా దినోత్సవ సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి మహిళలు సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నానని హోం మంత్రి అన్నారు. ప్రజా డైరీ మాసపత్రిక ఎడిటర్ వి సురేష్, డాక్టర్ విజయ భాస్కర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.