Ys Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం మాటల్లోనే కాక చేతల్లోనూ ప్రజలందరికీ సమాన అవకాశాన్ని కల్పిస్తున్నారు. కులం చూడం మతం చూడం అంటూ ఆయన ఆనాడు చేసినటువంటి వాగ్దానాన్ని నేడు నిలబెట్టుకుంటున్నారు. తాజాగా ఏపీలో వైయస్సార్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారిని చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం వైయస్సార్ పార్టీ తరఫున అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా అందులో 14 బీసీ ఎస్టీ ఎస్సీలకు కేటాయించారు. కేవలం నాలుగు మాత్రమే ఓసి అభ్యర్థులకు కేటాయించారు. దీనిని బట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నారో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు.
ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. “ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు ఒకే ప్రాధాన్యత ఇస్తున్నారు… ఏ ఒక్క వర్గం పైన విపక్షపూరితంగా వ్యవహరించడం లేదు. అందువలన రాష్ట్రంలో సామాజిక న్యాయం చక్కగా జరుగుతుందని గతంలో ఏ ప్రభుత్వం బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఎన్ని ఎమ్మెల్సీ స్థానాల్లో కేటాయించలేదు.. అని ఆయన పేర్కొన్నారు. అలాగే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఇన్ని అవకాశాలు ఎందుకు కల్పించలేదంటూ ప్రశ్నించారు. సామాజిక సాధికారతను జగన్ మాత్రమే చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు. ముందు ముందు బీసీలకు మైనార్టీలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.