Andhra New Highways రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలను పట్టణాలతో సమానంగా అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి దాదాపు 976 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గాలను విస్తరించి గ్రామాలను పట్టణాలను కలపడానికి సంకల్పించింది. కొత్తగా నిర్మించే రోడ్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించగా కేంద్రం ఇప్పటికే అంగీకారాన్ని తెలిపినట్టు తెలుస్తుంది.
మార్చి 22వ కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారిల సమావేశం జరగనుంది. దాదాపు 1100 కోట్ల రూపాయలతో ఈ రోడ్ల నిర్మాణం జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇందులో కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్రం వాటా 40 శాతంగా ఉండనునట్లు తెలుస్తొంది. రాష్ట్రమంతా తొందరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 1300 కిలోమీటర్ల పొడవునా కొత్త రోడ్లను నిర్మించింది. కొత్తగా నిర్మించినటువంటి ఈ రోడ్ల మార్గాలు ప్రజలకు ఎన్నో అవసరాలను తీరుస్తూ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పలు రహదారులను కలుపుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను పట్టణాలకు అనుసంధానం చేయడం వలన గ్రామాలకు ఎన్నో సౌకర్యాలు మరెన్నో పథకాలు నిర్ణీత సమయంలో అందుతున్నాయి. తాజాగా ప్రభుత్వం నిర్మించబోతున్న 976 కిలోమీటర్ల రోడ్లతో ప్రజలు మరింత లబ్ధి పొందుతున్నారని తెలుస్తుంది. అయితే 976 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఎక్కడినుంచి ఎక్కడికి పనులు జరుగుతాయి అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది ముఖ్యంగా వీటిని రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామీణ ప్రాంతాలను పట్టణాలకు అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలుస్తోంది కొన్ని రోజులు ఆగాల్సిందే.