Harish Rao అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు కానుకలు అందించనున్నారు అని చెప్పుకొచ్చారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఉన్న మహిళలందరికీ హరీష్ రావు శుభవార్త చెప్పారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు మూడు కానుకలు అందించనున్నారని తెలిపారు అందులో ఒకటి ఆరోగ్యం మహిళ రెండోది న్యూట్రిషన్ కిట్ కాగా మూడోది 750 కోట్ల వడ్డీ లేని రుణాలు అని మంత్రి తెలిపారు..
కరీంనగర్ వేదికగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు అనంతరం పట్టణంలోని మార్క్ఫెడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ విషయాలు తెలిపారు.. అలాగే మహిళలు క్యాన్సర్, రక్త హీనత, గర్బసంచి, అధిక బరువు, పోషకాహార లోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు, అవగాహన లేక, సమస్య ఉన్నా ఇతరులకు చెప్పలేక మీకు మీరే బాధపడుతుంటారు. అందుకే 8 రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్య మహిళ ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు.
అలాగే ఇందులో భాగంగా మహిళలకు వైద్యం చేసి పరీక్షలు చేసి మందులు కూడా అందిస్తారని తెలిపారు వ్యాధి తీవ్రతను బట్టి ప్రభుత్వం పెద్ద ఆసుపత్రికి వెళితే కావాల్సిన సహాయం అందిస్తుందని చెప్పుకొచ్చారు..అలాగే శ్రీరామనవమి పండగ అనంతరం న్యూట్రిషన్ కిట్లో నెయ్యి, ప్రోటీన్ మిక్స్ పౌడర్, కర్జూర పండ్లు, గోళీలు ఉంటాయన్నారు. పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అందరు గర్బిణులకు ఇవ్వబోతున్నాం అని ప్రకటించారు. అలాగే వడ్డీ లేని రుణాలు రూ. 750 కోట్ల రుణాలు విడుదల చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మీ ఖాతాల్లో జమ చేస్తున్నారు. మిగిలిన మొత్తం రెండో దఫాగా జూన్ నెలలో ఇస్తామని చెప్పారు.