హైదరాబాద్ లోని నాగోల్, కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహిళామణులు పాల్గొని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో..భాగంగా..అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తరువాత ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం సభ్యులు, మహిళా మణులు వాత్సల్యం ఫౌండేషన్ విద్యార్థినులతో కలిసి, మొత్తం 10 మొక్కలు నాటారు.తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఉప్పల స్వప్న గారు మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు మొక్కలు నాటాలని మొక్కలు నాటి రేపటి తరాలకు ఎన్నో విధాల ఉపయోగపడే మంచి ఆక్సీజన్, మంచి వాతావరణం కావాలంటే ప్రతీ ఒక్కరు, ప్రతి మహిళ మొక్కలు నాటాలని పిలుపు ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇంతటి చక్కటి అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో.. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, IVF స్టేట్ మహిళా విభాగం ట్రెసరర్ భువన,IVF నాయకురాళ్లు.. అర్చన, సరిత, సరళ, సరిత మరియు IVF మహిళా విభాగం సభ్యులు వాత్సల్యం ఫౌండేషన్ విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.