తెలంగాణ రాష్ట్రంలోమహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హోటల్ తాజ్ కృష్ణా వేదికగా వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.వీ హబ్ ప్రతినిధులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. రూ. 1.30 కోట్లు ఇస్తే వీ హబ్ నుంచి ఒక స్టార్టప్‌తో రూ. 70 కోట్లకు పెంచారు.
స్త్రీ నిధి కింద మహిళలకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. రూ. 750 కోట్లు వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నామని చెప్పారు. యువత ఎందుకు వ్యాపారవేత్తలు అవ్వకూడదు..? అని ప్రశ్నించారు. ప్రతీ పారిశ్రామిక పార్కులో 10 శాతం ప్లాట్స్ మహిళలకు కేటాయించామని తెలిపారు. ప్రతీ మూడు కోవిడ్ టీకాల్లో రెండు హైదరాబాద్ నుంచే వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు.