BRS Party MLA ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా రాష్ట్ర శాసనమండలి ఎమ్మెల్యేల కోట అభ్యర్థులను ప్రకటించారు.. ఈ మేరకు దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిని ప్రకటించారు. కాగా గవర్నర్ నామినేట్ చేసే మరొక ఇద్దరు పేర్లను క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది..
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని 3 శాసన మండలి స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ముగ్గురు శాసనమండలి సభ్యుల పదవీకాలం.. ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది. ఆలోగా కొత్త సభ్యుల నియామకం కోసం గులాబీ పార్టీలో కసరత్తులు మొదలైనట్టు తెలుస్తోంది. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
కాగా వీరిని ఈ నెల 9వ తేదీన నామినేషన్ వేయాల్సిందిగా కేసీఆర్ సూచించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు గవర్నర్ నామినేట్ చేసే మరొక ఇద్దరు పేర్లను క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది..