కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని భూమిరెడ్డి కాలనీలో నూతనంగా చేపడుతున్న సాయిబాబా ఆలయ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ పెద్దలు మరియు కాలనీ వాసులతో కలిసి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటానని పేర్కొన్నారు.
సాయిబాబా ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేయడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.