తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవ గత రాత్రి ఆలయ అర్చకుల సమక్షంలో శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు స్వామివారిని దర్శించుకున్నారు.
కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామస్తులు నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి పురుషుల కబడ్డీ పోటీలను జెండా ఆవిష్కరించి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు ప్రారంభించి మొదటి జట్టు పోటీదారులకు శుభాకాంక్షలు తెలిపారు. కబడ్డీ పోటీలలో భాగంగా 6 7 8 తేదీల్లో 10 జట్టుల పోటీదారులు పాల్గొంటున్నట్లు ఎనిమిదో తేదీ నాడు బహుమతుల ప్రథోత్సవానికి మంత్రులు, ఎంపీలు, జిల్లా ప్రజా ప్రతినిధులు విచ్చేస్తున్నట్లు ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, అన్నదాన విరాళాల హుండీలో విరాళాన్ని సమర్పించారు.
ప్రాచీన చరిత్ర కలిగిన కందుకూరు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో శోబోపేతంగా నిర్వహించటం, కనుమరుగవుతున్న క్రీడా స్ఫూర్తిని పెంపొందించే విధంగా ఎద్దుల బల ప్రదర్శన, పురుషుల కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారని నిర్వహుకులని అభినందించారు. కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను వీక్షించేందుకు వేలాదిమందిగా భక్తులు విచ్చేస్తున్నా తరుణంలో పోలీస్ భద్రతా, భక్తులకు సౌకర్యాలు తదితర ఏర్పాట్లను గురించి ఆలయ నిర్వహణలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.