Politics తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకుని, వినూత్నంగా పున:ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు..
సీఎం కేసీఆర్ చిగురించి ఆశలతో తమ జీవితాల్లోకి నూతనత్వాన్ని హోలీ రూపంలో స్వాగతం పలికే భారతీయ సంప్రదాయం ఎంతో గొప్పదని అన్నారు ఈ సందర్భంగా దేశ రాష్ట్ర పౌరులందరికీ హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పారు..
అలాగే ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ హోలీ పండుగతో పల్లెలన్నీ వెన్నెల నవరాత్రుల్లో సాగే చిన్నారుల జాజిరి ఆటపాటలతో కోలాటాల చప్పులతో వెళ్లి విరుస్తాయని అన్నారు చిన్న పెద్ద తేడా లేకుండా సింగిటి రంగులు నడుమ కేళి కేరింతలతో సాగే హోలీ మానవ జీవితమే ఒక వేడుక అనే భావాన్ని కలిగిస్తాయని చెప్పుకొచ్చారు ప్రకృతి మనలో మమేకమై ఇంతటి అందాన్ని ఇస్తుందని అనిపించేలా చేస్తుందని చెప్పుకొచ్చారు.. అలాగే దేశ ప్రజలందరి జీవితాల్లో నూతన ఉత్తేజం వెల్లివిరియాలని బేదబావాలను విడిచి పరస్పర ప్రేమాభిమానాలు పంచుకుంటూ ముందుకు సాగాలని చెప్పుకొచ్చారు మోదుగ పూలు వంటి సహజసిద్ధమైన రంగులతో హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కెసిఆర్ చెప్పుకొచ్చారు. అలాగే అందరూ ఎంత సంతోషంగా హోలీ పండుగను జరుపుకోవాలని ఇదే సంతోషం వారి జీవితాల్లో వెళ్లి విరియాలని ఆకాంక్షించారు.. స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతి కార్యాచరణ, తెలంగాణలోని దళిత బహుజన, సకల జనుల జీవితాల్లో నిత్య వసంతాన్ని నింపిందని కేసిఆర్ తెలిపారు. దేశ ప్రజలందరి జీవితాల్లో నూతనోత్తేజం వెల్లివిరిసేదాకా తమ కృషి కొనసాగుతూనే వుంటుందని.. ప్రజలందరూ ఆనందంగా ఉండటమే తమ ధ్యేయమంటూ కేసీఆర్ స్పష్టం చేశారు..