కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి మున్సిపాలిటీలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి 1వ వార్డు అపర్ణ పామ్ మిడోస్, అపర్ణ పామ్ గ్రూవ్స్, 6వ వార్డులలో పాదయాత్ర చేశారు. ఈ మేరకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచినీటి సమస్య లేకుండా చేపడుతున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అనంతరం అపర్ణ పామ్ గ్రూవ్స్ లో నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు.
6వ వార్డులో డ్రైనేజీ ఔట్ లెట్ సమస్యను పరిశీలించి, పార్క్ ను సందర్శించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజల కోసమే ప్రగతి యాత్ర చేపట్టడం జరిగిందన్నారు. ఈ పర్యటనలో అభివృద్ధి పనులు పరిశీలిస్తూ, ప్రజా అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన పనులను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేలా కృషి చేస్తున్నామని అన్నారు. గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో నిధులకు ఏ మాత్రం కొరత లేదన్నారు. కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్ల పనులు చేపడుతున్నామని అన్నారు.
భవిష్యత్తులో ప్రజలకు కావాల్సిన వసతులు ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో కొంపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, కౌన్సిలర్లు పూజారి వసంత, సన్న రవియాదవ్, పాక్స్ డైరెక్టర్ బూర్గుబావి సత్యనారాయణ, మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవేందర్ యాదవ్, సంగీత, శారద, లక్ష్మణ్, మహేష్ యాదవ్, యాదగిరి, బర్మ రాజు, వేణు యాదవ్, శ్రీకాంత్, నాగరాజు, సన్న రాజు, శన్ను, విమల్ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.