తెలంగాణ రాష్ట్రంలో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే సమయంలో పొరపాట్లు చేసిన అభ్యర్థులకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు మరో ఛాన్స్ ఇచ్చింది.
నేడు ఉదయం 10 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఎడిటింగ్ కు ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. పూర్తి వివరాలకు www.mhsrb.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.