ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్ తర్వత గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ వచ్చిన తర్వాత గత ఎనిమిదేండ్లలో రూ.745 గ్యాస్ ధర పెరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దీని వల్ల నిత్యావసర సరుకుల ధరలు అన్ని పెరుగుతాయన్నారు. పెంచిన ద్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులో ఉన్న గాంధీ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్ ఆందోళనకు దిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోపాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా మోదీ గ్యాస్ బండకు దండం పెట్టి ఓటు వేయాలని చెప్పారని గుర్తుచేశారు. ఇప్పడు ఆయన ప్రధాని అయినతర్వాత వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1100 దాటిందన్నారు. కేంద్రం విమాన చార్జీలు తగ్గించిందని, విమానాల్లో పేదలు వెళ్తారా అని ప్రశ్నించారు.