MINISTER RAJINI: తెలంగాణలో వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో….ఆంధ్రప్రదేశ్ లో మంత్రి విడదల రజిని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ర్యాగింగ్ విషయంలో రాష్ట్రంలో అన్ని కళాశాలల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
వైద్య విద్యార్థి ర్యాగింగ్ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో కలవరం సృష్టించింది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు అప్రమత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి రజిని సమావేశం ఏర్పాటు చేశారు. కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు చురుగ్గా పనిచేయాలని సూచించారు.
కళాశాలల నుంచి యాంటీ ర్యాగింగ్ కమిటీల నివేదికలు ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలని మంత్రి ఆదేశించారు. విద్యాలయాల్లో నాణ్యమైన విద్యతో పాటు…..పటిష్ట భద్రత కూడా ఇవ్వాలని చెప్పారు. అన్ని వైద్య కళాశాలల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్ తరగతులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు ఒత్తిడి తగ్గించేలా యోగా, ధ్యానం వంటి తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు.
మొదట జూనియర్, సీనియర్లకు భోజన సదుపాయాలు వేర్వేరుగా ఉండాలని ఆదేశించారు. కళాశాలల్లో ఫిర్యాదుల పెట్టే ఎర్పాటు చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి ర్యాగింగ్ కేసు కూడా ఉండకూడదని హెచ్చరించారు. ప్రతి పీజీ విద్యార్థి 3 నెలలపాటు గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉందని మంత్రి చెప్పారు. దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. కొంతమంది సీనియర్ అధ్యాపకులు…వారి సొంత క్లీనిక్ ల నేపథ్యంలో విద్యార్థులపై పనిభారం మోపుతున్నారని…..అది మంచిది కాదని స్పష్టం చేశారు.