KTR: మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలపై సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని, ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ పాల్గొన్నారు.
రాష్ట్రంలోని అర్హులైన పేదలకు ఇళ్లు, స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. దానివల్ల కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. 2014 ఏడాదిలో 1.25 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామని వెల్లడించారు.
నోటరీ చేసిన పత్రాలపై ప్రస్తావిస్తూ పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న కేసుల ప్రక్రియను, సమయానుకూల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. జీవో 58 కింద 20,685 ఇళ్లకు సంబంధించి ప్రక్రియ పూర్తి అయిందని స్పష్టం చేశారు. ఇంటి స్థలాల పట్టాల జారీని వేగవంతం చేయాలని సబ్ కమిటీ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఇళ్ల స్థలాలు కేటాయింపు, జీవో 58, 59, సాదాబైనామా, నోటరీ పత్రాలు, ఎండోమెంట్, వక్ఫ్ భూములు వంటి అంశాలపై బీఆర్ కే భవన్ లో కేటీఆర్…..సమావేశంలో చర్చించారు. ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని…..దాని కోసం ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. అందుకోసం కేసీఆర్ కూడా చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.