RAITHU BHAROSA: నాలుగో ఏడాది మూడో విడత రైతు భరోసా ఎప్పుడు జమవుతుందంటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. ఆంధ్రా రైతులకు వైయస్సార్ రైతు భరోసా నిధులు రేపు విడుదల కానున్నాయి.. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు గుంటురు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు.
వైసిపి ప్రభుత్వం ఇప్పటికే రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చింది అలాగే నష్టపోయిన రైతులకు ఎప్పటికప్పుడు చేయూత ఇస్తూనే వస్తుంది. కాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైసిపి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మూడేళ్లుగా రైతు భరోసాను ఎకౌంట్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాలుగవ ఏడాది మూడో విడత వైయస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ నిధులను వర్చువల్గా రైతులు అకౌంట్లోకి జమ చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి రేపు తెనాలిలోని భారీ బహిరంగ సభ వేదిక్కు చేరుకోనున్నారు. ఇటీవల పంట నష్టపోయినటువంటి రైతులకు సబ్సిడీ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
రైతు భరోసా నిధులు తమ అకౌంట్లోకి జమవుతాయని తెలిసి రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత రేపు మరల ముఖ్యమంత్రి తాడేపల్లి లో ఉన్నటువంటి తన నివాసానికి చేరుకొనున్నారు.