AP GOVT: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దొరకనుందా..!
రాజధాని అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దొరకానుందా అంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే నెల 28వ తారీకున ఏపీ రాజధాని కేసు విచారణకు రానుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే హక్కు లేదు అని హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించిన అంశాన్ని జస్టిస్ కెఎఫ్ జోసెఫ్, జస్టిస్ కె నాగరత్నం తో కూడిన ధర్మాసనం విచారించనుంది. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా సుప్రీంకోర్టు దానిపై స్టే విధించింది. ఒకే ప్రాంతంలో రాజధానిని ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
విశాఖపట్నం ఇక నుండి కార్యనిర్వహణ రాజధానిగా కొనసాగుతుందని గతంలో ఏపీ ప్రభుత్వ పాలకులు స్పష్టం చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మొత్తాన్ని అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో కేవలం ఒక ప్రాంతంలోనే అభివృద్ధి కేంద్రీకరణ కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్రానికి మూడు రాజధానులుగా నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా వస్తుందని అందరూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ సమర్థిస్తున్నారు. కాగా మరి త్వరలోనే సుప్రీంకోర్టులో ఏ తీర్పు వస్తుందో వేచి చూడాల్సిందే.