AP NEWS: రైతుల సంక్షేమంలో భారత్ లోనే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రం ఆంధ్ర.. కేరళ వ్యవసాయ శాఖ మంత్రి..
వైగా 2023 ఇంటర్నేషనల్ సెమినార్ ఆదివారం కేరళలో తిరుమంతపురంలో ప్రారంభమైంది.. వైగా అంతర్జాతీయ సదస్సు 2023లో కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్ రైతు సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పథకాలను చూసి రైతు సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
వారం రోజులపాటు జరగనున్నటువంటి ఈ సెమినార్ను ఏపీ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రులైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి, పి ప్రసాద్, చందర్ కుమార్ ప్రారంభించారు. సెమినార్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్నటువంటి సేవలను గుర్తించినటువంటి కేరళ వ్యవసాయ శాఖ మంత్రి తాము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్ఫూర్తితో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తాగుదారుల హక్కు చట్టం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ఈ సెమినార్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ఆలోచించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల నుంచి పుట్టినవే ఈ ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్స్, సాగుదారులు హక్కు చట్టం అని ఆయన పేర్కొన్నారు. వైయస్సార్ రైతు భరోసా ద్వారా 13500 చొప్పున రైతులు అందజేస్తున్నామని ఉచిత విద్యుత్ కూడా అందజేసే రైతు యొక్క సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.