jagadeesh: హైదరాబాద్లోని ఎమ్మెల్యేల గృహ సముదాయంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నేత, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు ఎండీ ఖాలేద్ అహ్మద్..మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో భారాస తీర్థం పుచ్చుకున్నారు. ఎండీ అహ్మద కు పార్టీ కండువా కప్పి మంత్రి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కేసీఆర్ పై రోజురోజుకు ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని మంత్రి జగదీశ్ వెల్లండించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే…….తెలంగాణలో అమలవుతున్న సంక్షేమాన్ని చూసి సరిహద్దు రాష్ట్రాల ప్రజలు తమను తెలంగాణ కలపాలని కోరుతున్నారని పేర్కొన్నారు. అంతగా కేసీఆర్ అభివృద్ధి వేళ్లూనుకుపోయిందని వ్యాఖ్యానించారు.
దేశ రాజకీయాల్లో ఎప్పటికైనా చక్రం తిప్పేది భారాస అని మంత్రి జగదీశ్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 8 ఏళ్లుగా అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి మరే రాష్ట్రంలోనూ జరగట్లేదని మరోసారి స్పష్టం చేశారు. అయితే తెలంగాణ అభివృద్ధిని చూసి మొత్తం దేశమే కేసీఆర్ వైపు చూస్తున్నారని…….ఆయన రావాలని ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు. దేశ ప్రజలంతా ఆయన నాయకత్వానికి మద్దతు చెబుతూ ఆహ్వానిస్తున్నారని స్పష్టం చేశారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ అదే పనిగా డప్పుకొడుతున్న కొన్ని రాష్ట్రాల్లోని ప్రజలు కూడా తెలంగాణ కలపాలని విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. దేశం మొత్తం కేసీఆర్ కోసమే చూస్తున్నారని మరోసారి ఉటంకించారు. ఎవరు అవునన్న కాదన్న భవిష్యత్తులో గులాబీ జెండా ఎగురుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి పునరుద్ఘాటించారు.