తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే టెన్త్ పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులను స్మార్ట్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తల్లిదండ్రులకు సూచించారు.
టెన్త్ విద్యార్థులను 2 నెలల పాటు ఉదయం 5 గంటలకే నిద్ర లేపి బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలని తల్లిదండ్రులు, HMలు, MEO, DEOలతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రత్యేక క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ అందించాలని మంత్రి తన్నీరు హారీష్ రావు సూచించారు.