దేశంలో 2024 లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పోటీ చేస్తే లో బీజేపీని 100 కంటే తక్కువ సీట్లకే పరిమితం చేయొచ్చన్నారు బిహార్ సీఎం నితీశ్ కుమార్.
కాంగ్రెస్ దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అధికారంలోని బీజేపీని గద్దె దించాలని.. ఇందుకోసం ప్రతిపక్షాలను ఏకం చేయడమే తన లక్ష్యమని అన్నారు. బిహార్ లోని పూర్నియాలో మహాఘట్బంధన్ కార్యక్రమం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.