Harish rao: సంగారెడ్డి కురుమ సంఘం బహిరంగ సభలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి దొడ్డి కొమురయ్య……స్ఫూర్తి ప్రదాత అని మంత్రి కొనియాడారు. సంగారెడ్డి జిల్లాలో త్వరలో కురుమ భవన్ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్…….రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని….దేశానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి స్పష్టం చేశారు.
మరో నెల రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. యూనిట్ కాస్ట్ కూడా పెంచామని మంత్రి తెలిపారు. కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశ పెట్టడం వల్ల రాష్ట్రంలో బాల్యవివాహాలు ఆగిపోయాయని….ఆ ఘనత కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి తెలిపారు. వేరే రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు పెట్టి కేంద్రం నుంచి డబ్బు తెచ్చుకుంటే……. కేసీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టేది లేదన్నారని స్పష్టం చేశారు. భాజపాకు ఎప్పుడు అదానీ, ప్రైవేటు కంపెనీల సంక్షేమమే కావాలని మండిపడ్డారు. కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ పెట్టాలని ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నా……దానిపై ఉలుకుపలుకు లేదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేసినా……దానికి భగవంతుని నామాలే పెడతారని మంత్రి హరీశ్ రావు అన్నారు. మల్లన్నసాగర్ నిర్మించినప్పుడు ……..ప్రతిపక్షాలు హేళన చేస్తే…..మూడేన్నరేళ్లలో పూర్తి చేశామని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ కీర్తి ప్రతిష్టల గురించి గొప్పగా చెబుతున్నారని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ కు దేశ అభివృద్ధి తప్ప మరో ధ్యాస లేదని అన్నారు. కచ్చితంగా కేంద్రంలో భారాస జెండా ఎగురుతుందని మరోసారి మంత్రి స్పష్టం చేశారు.