ఏపీ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను మార్చి 17న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టే అవకాశముంది. మార్చి 14న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి..
విశాఖలో జీ-20 సమావేశాల నేపధ్యంలో 25 లేదా 27న సమావేశాలు ముగించనున్నారు. 22న ఉగాది సందర్భంగా ఒకటి లేదా రెండు రోజులపాటు సెలవు ఇవ్వనున్నారు.
విశాఖకు సీఎం కార్యాలయం తరలివెళ్లడంపై ముఖ్యమంత్రి జగన్ ఈ సమావేశాల్లో ప్రకటన చేసే అవకాశముందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.