AVINASHREDDI: వాస్తవాలు రావాలంటే మీడియా బాధ్యతగా వ్యవహరించాలని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. సీబీఐ విచారణ ఏకపక్షంగా జరుగుతోందని మండిపడ్డారు. ఒక వ్యక్తే లక్ష్యంగా జరుగుతున్నాయని అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు
వివేకా నందరెడ్డి చనిపోయనరోజు మార్చురీ దగ్గర ఏం మాట్లాడానో…..ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నానని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. చివరకు విజయమ్మ దగ్గరకు వెళ్లిన…. బెదిరించి వచ్చానని చెప్పడం దారుణమని అన్నారు. నేను తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ చేశానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందన వరకూ పెంచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక నిజాన్ని వంద నుంచి సున్నాకు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వాస్తవాన్ని టార్గెట్ చేయకుండా వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. వక్రీకరించే వార్తలే కాకుండా గంటలపాటు టీవీల్లో డిబెట్ లు పెడుతున్నారని మండిపడ్డారు. గూగుల్ టేకౌటా లేక తెదేపా టేకౌటా అనేది భవిష్యత్తులో తేలుతుందని అన్నారు,
వివేకా నంద రెడ్డి చనిపోయిన రోజు అక్కడికి వెళ్లేటప్పటికే అక్కడ లేఖ ఉందని అన్నారు. ఆ లేఖను దాచిపెట్టారని……అది హత్య అని లేఖలో ఉందని స్పష్టం చేశారు. విచారణ జరిగినప్పుడు మాత్రం తన ముందు ల్యాప్ టాప్ ఉందని…..ఎందుకోసం అక్కడ ఉంచారో ఇప్పటికీ తెలియదని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.