KAVITHA: పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముంబయి వెళ్లిన ఎమ్మెల్సీ కవితను……భారాస ముంబయి యూనిట్ నాయకులు స్వాగతం పలికారు. అంతేకాకుండా ఎయిర్ పోర్టు సమీపంలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహారాష్ట్రలో కూడా అమలు చేయాలంటూ ఆ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహారాష్ట్ర అభివృద్ధికి భారాస కీలక పాత్ర పోషిస్తోందని కవిత స్పష్టం చేశారు.
తెలంగాణ, మహారాష్ట్ర పక్క పక్క రాష్ట్రాలైనా…..అమలు చేసే సంక్షేమ పథకాల్లో చాలా తేడా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భాగ్యనగర్ లో ప్రతిరోజు 24 గంటల పాటు తాగునీరు సరఫరా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే ముంబయిలో మాత్రం 2గంటలే ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నప్పుడు……మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని ప్రశ్నించారు. ఇంటి ఇంటికి నీరు, విద్యుత్ అందించడంలో తెలంగాణ…….దేశంలోనే ముందు వరుసలో ఉందని కవిత గుర్తు చేశారు.
తెలంగాణలో నీరు, విద్యుత్ సమస్యలను నూటికి 98 శాతం పరిష్కరించిందని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఇలాంటి సంక్షేమం అమలు చేసే వరకు భారాస తరపున పోరాటం చేస్తామని కవిత అన్నారు.