BUGGANA: చంద్రబాబుకు తప్పుడు ప్రచారం చేయడం తప్ప….మరోకటి లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2019 నుంచి క్రైం రేటు తగ్గిందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా దాడులు లేవని అన్నారు. అక్రమ కేసులు కూడా నమోదు కాలేదని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేయడం తప్ప మరో పని చేతకాదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి బీసీలకే తగిన ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టం చేశారు.
సామాజిక న్యాయం అంటే ఏంటో అని సీఎం జగన్ చేసి చూపించారని మంత్రి అన్నారు. చంద్రబాబు హయాంలో అదేమీ జరగలేదని……కానీ ముఖ్యమంత్రి మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం నెరవేర్చారని గుర్తు చేశారు. సీఎం జగన్ ప్రజల కోసమే పని చేస్తారని అన్నారు. కావాలనే తెదేపా, చంద్రబాబు…..జగన్ ను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ నేతల్లా కాకుండా వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. అంతేకాకుండా గన్నవరంలో కావాలనే హైడ్రామా సృష్టించారని ఆరోపించారు. ఒకసారి ప్రజలు చీ కొట్టినా….ఇంకా బుద్ధి మార్చుకోవట్లేదని మండిపడ్డారు.