తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాలీవుడ్ మీడియా ABC న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హాలీవుడ్ చిత్రాలు చేస్తారా అని యాంకర్ అడిగాడు..
దీనికి సమాధానంగా చెర్రీ మాట్లాడుతూ ‘నేను ఆల్రెడీ కొన్ని ఇండియన్ సినిమాలు చేస్తున్నాను. నాకు హాలీవుడ్ మేకర్స్‌తో పనిచేయాలని కోరిక. నేను ఇష్టపడే అనేక మంది డైరెక్టర్స్ హాలీవుడ్ లో ఉన్నారు.
భవిష్యత్తులో హాలీవుడ్లో ఛాన్స్ వస్తే నేనైతే సిద్ధంగా ఉన్నా’ అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పారు. తప్పకుండా ఛాన్సులొస్తాయని ఈ సందర్భంగా చెర్రీతో యాంకర్ చెప్పారు.