Politics పోసాని మురళీకృష్ణ తాజాగా చంద్రబాబు నాయుడు పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కాపులకు చంద్రబాబు చేసిన అన్యాయం ఎంతటిదో గుర్తుంచుకోవాలని చెప్పుకొచ్చారు.. కాపులు చంద్రబాబు నాయుడ్ని నమ్మద్దని అలా చేస్తే వారి గొయ్యి వాలే తవ్వుకున్న వాళ్ళు అవుతారంటూ హెచ్చరించారు గత ఎన్నికల్లో ఏం జరిగిందో తరచి చూస్తే అన్ని విషయాలు బయట పడతాయని చెప్పుకొచ్చారు.
పోసాని మురళీకృష్ణ తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ చంద్రబాబు నాశనం చేస్తారని దయచేసి ఎవరూ చంద్రబాబుని నమ్మొద్దు అంటూ తెలిపారు అలాగే వంగవీటి మోహనరంగా కోసం కూడా గుర్తుచేసుకున్నారు.
అలాగే ఈ సందర్భంగా మాట్లాడిన పోసాని.. “కాపు సోదరులకు చెబుతున్నా.. నేను, వంగవీటి మోహన రంగా ఎంతో ఆప్యాయంగా ఉండే వాళ్లం. నేను కమ్మ కులంలో పుట్టాను కానీ వేరే వాళ్లకు వ్యతిరేకం కాదు. కానీ చంద్రబాబు లాంటి వాణ్ని నమ్మకండి. చిరంజీవి ఎన్నికల్లో ఓడిపోవడానికి, రంగా హత్యకు చంద్రబాబే కారణం. అప్పట్లో కాపులకు ఓటేస్తే కమ్మ వాళ్లను చంపేస్తారని ప్రచారం చేశారు. అలాంటిది మీరు చంద్రబాబుకు ఓటేద్దామా అనుకుంటే అది విజ్ఞతకు వదిలేస్తున్నా. చంద్రబాబు లాంటి వాణ్ని నమ్మకండి.. చంద్రబాబు నాయుడు గెలిస్తే తరతరాలుగా వారి కుటుంబం మాత్రమే ముఖ్యమంత్రులు అవుతారని మరి ఎవరికి అవకాశం ఇవ్వరు అతని తర్వాత అతని కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు అంతే తప్ప పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితిలో ముఖ్యమంత్రి కాలేదు కానీ పవన్ కళ్యాణ్ అతన్ని ముందుకు వెళ్లడం దురదృష్టకరం.. “అని పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యానించారు.