Politics ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ రానున్నారు ఫిబ్రవరి 24న జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆంధ్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించనున్నారు ఫిబ్రవరి 24న ఈ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు విచ్చేశారు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కొత్త గవర్నర్ కు స్వాగతం పలికారు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు.. ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న గవర్నర్‌కు జగన్ ఘన స్వాగతం పలికారు సతీసమేతంగా గవర్నర్ రాజభవన్ కు వెళ్ళనున్నారు..
ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు గవర్నర్లకు బదిలీ జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచంద్రకు గవర్నర్‌గా నియమించారు.. అలాగే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌ను ఏపీ గవర్నర్‌గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన విడుదలైంది. వీరితో పాటు పలువురు రాష్ట్రాల గవర్నర్లను వివిధ రాష్ట్రాలకు బదిలీ చేశారు.. అలాగే జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ గా రాధాకృష్ణన్ నియమించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా లెఫ్టినెంట్ జనరల్ కైవల్యను సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను నియమించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివప్రతాప్ శుక్లాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. అసోం గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియాను నియమించారు. ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న సుశ్రీ అనసూయఉకే మణిపూర్ గవర్నర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ గా ఉన్న గణేశన్ నాగాలాండ్ గవర్నర్ గా బదిలీ అయ్యారు.