MINISTER SIDIRI: తెదేపా పక్కదారి పట్టించే రాజకీయాలు చేస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం….సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించారని మంత్రి అన్నారు. అంతేకాకుండా ఇలాంటి చర్యలను ఏ ప్రభుత్వం ఇలా చేసిందా అని ప్రశ్నించారు.
లోకేశ్ ప్రతిసారీ వడ్డెర వర్గాన్ని వైకాపా అణచివేస్తోనందని అంటున్నారని తెలిపారు. మీరు తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తెలిపారు. వడ్డెర వర్గానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. బీసీలకు చంద్రబాబునాయుడు చేసినంత అన్యాయం మరెవరూ చేయలేదని అన్నారు. బీసీలను అవమానానికి గురిచేశారని అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం…..పూర్తి ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు.
గతంలో బీసీలకు చంద్రబాబు, లోకేశ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికలు…..పెత్తందారీ వ్యవస్థకు, పేదవాడికి మధ్య జరగనున్నాయని అన్నారు.
చంద్రబాబు మనకు చేసిన అన్యాయాన్ని మనమెప్పుడూ మరిచిపోకూడదని అన్నారు. అంతలా బీసీలను అణిచి వేశారని పేర్కొన్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయనకి బీసీలపై పగ, ప్రతీకారాలు ఇంక తగ్గలేదని అన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకురాకూడని కోర్టుకు ఎక్కారని తెలిపారు. నిరుపేదలు ఇంగ్లిషు మీడియం చదవకూడదనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. సిగ్గులేని రాజకీయాలకు కేరాఫ్ అడ్రసు చంద్రబాబే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం మాత్రం ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటోందని స్పష్టం చేశారు.