SABITA: రంగారెడ్డి జిల్లా జల్ పల్లి పరిధిలో కొంతమంది వ్యక్తులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారాసలో చేరారు.18, 19 వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో…..దాదాపు120 మంది కుటుంబసభ్యులు భారసలో తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో భారాస నేతలు నగేశ్, సాజీద్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. భారాస ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ప్రజా క్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని….మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలందరికీ సముచిత స్థానం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, చెప్పిన విధంగా ప్రజల బాగుకోసం సీఎం అహర్నిశలు పాటుపడుతున్నారని గుర్తుచేశారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మునుపెన్నడూ లేని విధంగా మౌలిక వసతులు సమకూర్చుతున్నారని తెలిపారు.
సీఎం సహాయనిధిని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోలేనటువంటి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతోగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. సాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేసి చూపించారని మంత్రి సబితా అన్నారు. అన్ని రకాలుగా రాష్ట్రంలో వసతులు కల్పిస్తున్నారని గుర్తు చేశారు. ఆయన సారధ్యంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించారని తెలిపారు.