MINISTER JOGI: పెత్తందారీ విధానాన్ని నరనరాల్లో జీర్ణించుకున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి జోగి రమేశ్ విమర్శించారు. సామాజిక న్యాయం అంటే ఇది అని చేసి చూపించిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని మంత్రి వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ మాపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిదని మంత్రి అన్నారు. ఏమిచ్చినా సరే రుణం తీర్చుకోలేనంతగా మాపై ఆదరణ చూపించారని మంత్రి కొనియాడారు. తన గుండెల్లో మా పట్ల ఎంత అభిమానాన్ని చూపిస్తున్నారన్నారా అనిపించింది. సామాజిక న్యాయం అంటే రుచి చూపిస్తారని సీఎం చెప్పారని గుర్తు చేశారు. కానీ సామాజిక న్యాయం ఇంత ప్రేమగా ఉంటుందనేలా ఆశ్చర్యపరిచారని మంత్రి అన్నారు.
ఇది నిజమా, అబద్ధమా అన్నట్లు ఉంది, రాష్ట్రప్రజలంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారని అన్నారు. జయహో జగన్ అన్న అని ప్రజలు కీర్తిస్తున్నారు. బీసీలకు ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం అంటే చేసి చూపించారని అన్నారు. రిజర్వేషన్లు లేకపోయినా ఎక్కువ పదవులు ఇచ్చిన ఘనత జగన్ ది అని పునరుద్ఘాటించారు.
అసెంబ్లీ నుంచి పారిపోవడం చంద్రబాబు…..ఇప్పుడు రోడ్ల మీద పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వీది రౌడీల్లా ప్రవర్తించడం కాదని అన్నారు. ఎవరి హయాంలో సామాజిక న్యాయం జరిగిందో చర్చకు సిద్ధమా అని చంద్రబాబుకు మంత్రి సవాల్ విసిరారు. ప్రజలంతా ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నారని అన్నారు. బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.